పేదోడికే డీజిల్ కొరత.. పెద్దోడికి కావలసినంత… చేతివాటం ప్రదర్శిస్తున్న ఆపరేటర్లు?..

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

పెట్రోల్,డీజిల్ నిల్వలు నిండుగా ఉన్నాయని ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం చెప్పే గాలి మాటలు నీటి మూటలుగానే ఉన్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని పేదోడి బతుకులు పెట్రోల్, డీజిల్ కొరత వలన వ్యాపారాలు సాగక నరకయాతన పడుతున్నారు. చిన్నపాటి వాహనాలు గల పేదోడు రోజు రెండు లేక మూడు వందల రూపాయల ఇంధనాన్ని నింపుకొని ఏరోజుకారోజు సంపాదించి జీవనం సాగించే పేదోడికి ఇంధనం కొరత వలన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధిక వడ్డీకి ఫైనాన్స్ ద్వారా వాహనాలు తీసుకున్న వారు వాయిదాలు చెల్లించక పోవడంతో వారి వాహనాలను ఫైనాన్స్ వారు జప్తు చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఇలా ఉండగా పెట్రోల్ డీజిల్ కొరత పేతుడికి మాత్రమే ఎందుకు ఉంటుంది. ఈ కొరత వలన ధన బలం కానీ, రికమండేషన్స్ ఉన్నవారికీ కానీ ఈ కొరత ప్రభావం ఏమైనా ఉంటుందా,సదాశివాపేట లోని విట్టలయ్య పుంపులో మాత్రం ఆపరేటర్లదే ఇస్తారాజ్యం. డీజిల్ లేదని చెపుతూనే వారికి నచ్చినవారికి డబ్బాలకు డబ్బాలు నింపుతూనే వుంటారు. చాటు మాటున కార్లలో పోస్తూనే వుంటారు. వీరి ఆగదాలను అరికట్టలేరా అని ప్రజలు అంటున్నారు. స్టాక్ లేదని చెబుతూనే చాటుగా విక్రాయించడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు