ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కంది మండలం జుల్కల్ గ్రామంలోని యం.వై.కె కంపెనీ, యు.ఐ పైప్ ఫిట్టింగ్ కంపెనీ లలో ఎ.హెచ్.టి.యు సంగారెడ్డి బృందం ఆద్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళా మరియు బాలల రక్షణపై కంపనీ ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు..

TG5,సంగారెడ్డి ప్రతినిధి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఆదేశానుసారం, ఈ రోజు (29.04.2026) సంగారెడ్డి జిల్లా, కంది మండలం జుల్కల్ గ్రామంలోని యం.వై.కె కంపెనీ, యు.ఐ పైప్ ఫిట్టింగ్ కంపెనీ లలో లలో అంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఏహెచ్‌టీయూ ఇన్‌చార్జ్ సీహెచ్. ప్రసాద్ రావు ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఏహెచ్‌టీయూ బృందం అధికారులు మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా, కార్మికుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, ఈవ్ టీజింగ్, అవయవాల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక దాడులు, సైబర్ స్టాకింగ్, సైబర్ బులీయింగ్, సైబర్ మోసాలు వంటి అంశాలపై వివరించడం జరిగింది. అదేవిధంగా అత్యవసర సేవల కోసం పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు 100, 112, మహిళల హెల్ప్‌లైన్ 1091 / 181 / 1098, చైల్డ్ హెల్ప్‌లైన్, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 వంటి సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యం ఏహెచ్‌టీయూ ఎస్ఐ యం.డి లాల్ అహ్మెద్, మాణిక్ రెడ్డి, సిబ్బంది, కంపెనీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు