TG 5,సంగారెడ్డి ప్రతినిధి :
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఆదేశానుసారం ఈ రోజు తేది: 29.04.2026 నాడు సంగారెడ్డి భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ఎంఆర్ఎఫ్ కంపెనీ సదాశివపేట, అనోర ఫార్మా కంపెనీ గుమ్మడిదలలో బాలల సంక్షేమం, యువత అభివృద్ధి కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా భరోసా కో ఆర్డినేటర్ దేవలక్ష్మీ మాట్లాడుతూ.. లింగ సమానత్వం, పితృస్వామ్య వ్యవస్థ, ఆడ, మగా తారతమ్య బేధం లేకుండా నడుచుకోవాలని సూచించారు. స్త్రీలకు సామాన్య గౌరవం ఇస్తూ ప్రతి పనిలో మగవారితో సమానంగా ఆడవారిని అన్ని విషయాలలో సమయంగా చూడాలని అన్నారు. చైల్డ్ మ్యారేజ్ వలన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించడం జరిగింది.
పోక్సో చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ, పోక్సో కేసులను తీవ్రంగా పరిగణిస్తూ నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయబడుతున్నాయని తెలిపారు. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం, కేసుకు సంబంధించిన సమాచారాన్ని అందించడం తప్పని సరి అన్నారు. మౌనం వీడి నిర్భయంగా ముందుకు వచ్చినప్పుడే సమస్యలకు న్యాయం జరిగి, ఇతరులకు అలాంటి ఘటనలు జరగకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.
అత్యవసర సమయంలో ఉపయోగపడే డైల్ 100, మహిళా హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నెంబర్లను అదేవిధంగా జిల్లా భరోసా కేంటర్ నెంబర్ 8712656773 మీ ఫోన్ లో సేవ్ చేసి పెట్టుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాలలో సదాశివపేట సిఐ వెంకటేశ్ ,ఎంఆర్ఎఫ్ అడ్మిన్ పటేల్, అనోర ఫార్మా కంపెనీ హెచ్ఆర్ మానేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, కంపెనీ యాజమాన్య, భరోసా సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









