నాగులాపల్లి గ్రామం, సదశివాపేట మండలం, సంగారెడ్డి జిల్లాలో లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

TG5, సంగారెడ్డి ప్రతినిధి

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు Dr. కిరణ్ రెడ్డి డా. చిరంజీవి, మరియు వ్యవసాయం అధికారి రమేష్ వ్యవసాయ విస్తరణ అధికారి S , సర్పంచ్ శివానంద్ అభ్యుదయ రైతు రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

శాస్త్రవేత్తలు రైతులను, పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించాలనీ, ఇది పురుగులను ఆకర్షిస్తుందని వివరించారు. ఎరువులు, పురుగుమందులను పరిమిత పరిమాణంలో ఉపయోగించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించి, మట్టికి ఆరోగ్యం చేకూరుస్తుందని తెలియజేశారు.అధిక దిగుబడి కొరకు పంట మార్పిడి అనుసరించాలని, అన్నీ సీజన్లలో ఒకే పంట వేయడం మానుకోవాలని సూచించారు. పచ్చి ఎరువు పంటల సాగు ప్రోత్సహించాలనీ వివరించారు.

రైతులు పచ్చి ఎరువు పంటల విత్తనాల లభ్యత, ట్రాన్స్‌ప్లాంటింగ్ యంత్రాలకు సంబంధించిన సబ్సిడీలపై ప్రశ్నలు అడిగారు. శాస్త్రవేత్తలు ప్రో. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన కొత్త రకాల విత్తనాలపై వివరాలు అందించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తే బిల్లులు తీసుకుని భద్రపరుచుకోవాలని సూచించారు.

నీటి వృథా తగ్గించేందుకు డ్రిప్ ఎర్రిగేషన్, స్ప్రింక్లర్ విధానాలను పాటించాలని, పర్యావరణ రక్షణకు వృక్షాలను పెంచాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం రైతులలో సరికొత్త పరిజ్ఞానం, సాంకేతికతలపై అవగాహన పెంచి మంచి ఫలితాలు అందించనుందని ఆశిస్తున్నాము.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు