పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే తమ ప్రభుత్వా లక్ష్యం. టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.

TG 5, సంగారెడ్డి ప్రతినిధ

  • సొంతిల్లు కట్టుకుంటామని కలలో కూడా ఊహించలేకపోయాం.
  •  ఆనందభాష్పాలతో నిర్మల జగ్గారెడ్డికి కృతజ్ఞతలు.
  • లబ్ధిదారులు ముబారక్పూర్ స్వరూప.

సదాశివపేట మండలంలోని కోల్కూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ముబారక్పూర్ స్వరూప ప్రభు ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం టీజీఐఐసీ తూర్పు నిర్మల జగ్గారెడ్డి చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే, తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ముబారక్పూర్ స్వరూప సొంత ఇల్లును కట్టుకుంటామని తాము కలలో కూడా ఊహించలేకపోయామని , తమ ఆనంద భాష్పాల ద్వారా నిర్మల జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ గడీల రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఒగ్గు శ్రీనివాస్, సర్పంచులు మాచిరెడ్డిపల్లి మోహన్ గౌడ్, కంబాలపల్లి సర్పంచ్ ఇందూరిబాబు, నిజాంపూర్ సర్పంచ్ సత్యనారాయణ, కోల్కూర్ నాయకులు మాణిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ధనరాజ్, వార్డు సభ్యులు సాబీర్, సందీప్, రమేష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు