నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం మక్కాపల్లి గ్రామానికి చెందిన ప్రముఖులు నారోజు వెంకటాచారి కుమారుడు రాజశేఖర్ వివాహం, పద్మజతో బుధవారం సంగారెడ్డి జిల్లాలోని ఎస్వీ (SV) గార్డెన్లో అత్యంత వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై, వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన దంపతులు నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో బీఆర్ఎస్ నాయకులు మునుకుంట రాజేష్ రెడ్డి, మక్కాపల్లి సర్పంచ్ అందుగుల సీనయ్య, వరుడి తండ్రి నారోజు వెంకటాచారి, పుల్లారెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మక్కాపల్లి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, బంధుమిత్రులు హాజరై వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
Post Views: 27









