GSR – CCPL–4 (2026)క్రికెట్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం ఎమ్మెల్యే జీఎస్సార్…

భూపాలపల్లి నియోజకవర్గంలోనీ చిట్యాల మండలంలో నిర్వహించిన GSR CCPL–4 (2026) క్రికెట్ పోటీల విజేతలకు గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు *శ్రీ గండ్ర సత్యనారాయణ రావు *బహుమతులను అందజేశారు.ఈ పోటీలలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.1,00,000/- రూపాయల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.50,000/- రూపాయల నగదు బహుమతిని ఎమ్మెల్యే ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మనిషిలో క్రమశిక్షణ,జట్టు భావన,నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని,శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం కూడా క్రీడల ద్వారా వస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు గ్రామీణ స్థాయిలో ప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మళ్ళీ వచ్చే CCPL క్రికెట్ పోటీల వరకు చిట్యాల మండలంలో క్రీడ స్టేడియంను మంజూరి చేయిస్తానని హమీ ఇచ్చారు. చిట్యాల మండలమును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, చిట్యాల ఆర్.టి.సి బస్టాండ్ ను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి గుమ్మడి శ్రీదేవి ,భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అంబాల శ్రీనివాస్ ,స్థానిక నాయకులు, క్రీడాకారులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు