పార్కు కబ్జా స్థలాన్ని కబ్జా చేసిన కాంగ్రెస్ నేతలు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లపై చర్యలు తీసుకోవాలి

బడంగ్ పేట్ సర్కిల్
గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధి లోని శంషాబాద్ జోన్, బడంగ్ పేట్ సర్కిల్ పరిధి నాదర్గుల్ డివిజన్,అల్మాస్ గూడ లోని సర్వే నెంబర్ 31,32,33,34 లో ఉన్న 1295 గజాల పార్క్ స్థలాన్ని కాంగ్రెస్ నేతలు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి,ఏఐసిసి విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి కబ్జా కు పాల్పడ్డారని బీజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామీడి సూర కర్ణ రెడ్డి బడంగ్ పేట్ సర్కిల్ డిసి సమ్మయ్య కు వినతి పత్రం అందజేశారు.రామిడి కళావతి నగర్ లోని 294 గజాల పార్కు స్థలం కబ్జా చేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని సూర కర్ణ రెడ్డి తెలిపారు.వెంచర్ నిర్మాణం చేస్తున్నప్పుడు అక్కడ బావి ఉండేదని ఆ బావిని పూడ్చేసి పార్కు స్థలంగా చూపించి పట్టాదారులు ప్లాట్లు అమ్మివేసారని,ప్రస్తుతం పట్టాదారులు ఆ స్థలాన్ని కబ్జాకు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.బీఆర్ఎస్ కాలనీ లో 10001 గజాల ప్రభుత్వ స్మశాన వాటిక సంబంధించిన స్థలం పార్కు గా కేటాయించడం జరిగిందని దానిని కూడా కబ్జా చేసి అమ్మి వేశారని రెండు పార్కులు కలిసి మొత్తం 1295 గజాల స్థలం ఉంటుందని వీటి విలువ సుమారు 6 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.కబ్జాకు పాల్పడిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరిమైన చర్యలు తీసుకొని ప్రహరీ గోడ నిర్మించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని అన్నారు.రామిడి కళావతి, బీఆర్ఎస్ కాలనీ ప్రజలకు అంటగా ఉంటానని సూరకర్ణ రెడ్డి తెలిపారు.ప్రభుత్వ సంబంధించిన పార్కు స్థలాలను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేయడం సిగ్గుచేటు ను మండిపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు