మే 2న నల్గొండలో భారీ జాబ్ మేళా

నల్లగొండ :

మే 2న నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
జాబ్ మేళా పై రూపొందించిన గోడపత్రికను మంగళవారం అయన తన చాంబర్లో ఆవిష్కరించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో జాబ్ మేళాలను నిర్వహించనున్నదని తెలిపారు. ఇందులో భాగంగా మే 2 న నల్గొండ లోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన ఉద్యోగార్థులకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు రాష్ట్రంలోని పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయని, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, డిజిటల్ మీడియా, ఫైనాన్స్, హెల్త్ కేర్ ,ఐటి ,బిజినెస్ సేవలు, కస్టమర్ సర్వీస్, లాజిస్టిక్స్, హాస్పిటల్ రంగాలలో అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
ఈ జాబ్ మేళాలో పాల్గొనదలచే అభ్యర్థులు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక యూత్ అండ్ స్పోర్ట్స్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే వెబ్ పోర్టల్ https://satg.telangana.gov.in ప్రజా పాలన పోర్టల్ ను స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ అధికారి అక్బర్ ఆలీ ,జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సతీష్, జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ, డీఈవో బిక్షపతి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాస్ జిల్లా మేనేజర్.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు