సెంట్రింగ్ కార్మికుల సమ్మె: కర్మన్‌ఘాట్‌లో భారీ బైక్ ర్యాలీ, రేట్లు పెంచాలని డిమాండ్

హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు కర్మన్ ఘాట్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు మరియు కార్మికుల సమస్యల సాధన కోసం ఈ నెల 16వ తేదీ నుండి సెంట్రింగ్ పనులను బంద్ చేశారు.ఈ కార్యక్రమం లో భాగంగా ఈరోజు ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేస్తూ కర్మన్ ఘాట్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.సెంట్రింగ్ పనికి ప్రస్తుతం ఒక ఫీట్‌కు ఇస్తున్న రూ.40 కు రూ.11 పెంచి మొత్తం రూ.51 ఇవ్వాలని కాంట్రాక్టర్లు,కార్మికులు డిమాండ్ చేశారు.లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన సెంట్రింగ్ సామగ్రి తరచుగా దొంగతనాలకు గురవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖలో దొంగిలించిన సామాను కొనుగోలు చేయకుండా ప్రత్యేక చట్టాలు ఉన్నట్లే, సెంట్రింగ్ సామాను ఎవరూ అక్రమంగా కొనుగోలు చేయకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.అలాగే ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికులకు శాశ్వత గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు రూ.3000 పెన్షన్ అందించాలని, ప్రమాదవశాత్తు మరణించిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్, నారాయణ, యాదయ్య, శ్రీనివాస్, కడలి నాగరాజు, లక్ష్మారెడ్డి, కృష్ణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు