ఇటీవల కాలంలో రాష్ట్రంలో నేపాలీ గ్యాంగ్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది, పని చేస్తున్న ఇండ్లకే కన్నం వేయడం ఇంటి ఓనర్లను చంపడం వారికి పరిపాటిగా మారింది, ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ *”మీ సురక్ష యాప్”* లాంచ్ చేసింది, ఈ యాప్లో ఇంటి పని మనుషుల వివరాలు నమోదు చేయడం వలన ఏదైనా దోపిడి జరిగినపుడు లేదా ఇంకేదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకున్నప్పుడు నిందితులను పట్టుకోవడం సరళీకృతం అవుతుంది, ఇదే విషయమై మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సన్ షైన్ పార్క్ కాలనీలో అక్కడి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీసులు, ఈ కార్యక్రమంలో ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్, ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ సిఐ బాల స్వామి, ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ..
Post Views: 19









