• ప్రజా సమస్యల సత్వర పరిష్కారానకి ప్రజావాణి కార్యక్రమం..
• ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ
TG 5, సంగారెడ్డి ప్రతిని
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ, సంబంధిత అంశాలపై స్థానిక ఎస్.హెచ్.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోయిన పక్షంలో ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే మధ్యవర్తులను నమ్మకుండా, తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.









