మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని 181 మీర్జాల్‌గూడ డివిజన్ వాణి నగర్‌లో రూ.42 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బి.కే. శ్రీనివాస్, మీర్జాల్‌గూడ డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
అనంతరం మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాలనీవాసులు డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీసీ జాకియా సుల్తానాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.









