నారాయణఖేడ్, మే 18 (tg5న్యూస్ )( జర్నలిస్ట్ షైక్ ఫయాజ్ )
తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీ.వై.జె.ఎఫ్) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన షేక్ మహబూబ్‌కు నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన టీ.వై.జె.ఎఫ్ సభ్యులు ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా షేక్ మహబూబ్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల నారాయణఖేడ్ ప్రాంత జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
షేక్ మహబూబ్ నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, అక్రిడిటేషన్, సంక్షేమ పథకాల అమలుకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీ.వై.జె.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్, తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఇబ్రాహీం, తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అబ్దుల్ జబ్బార్, మండల అధ్యక్షుడు అంజనేయులు, యూనియన్ సభ్యుడు ఆనంద్ తదితరులు పాల్గొని షేక్ మహబూబ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.









