వల్లభపురం గ్రామ బాధితురాలికి మన్నెం రంజిత్ యాదవ్ ఆర్థిక సాయం

నాగార్జున సాగర్ నియోజకవర్గం,
నిడమానూరు మండలం,
వల్లభపురం గ్రామం లో

ఇటీవల కురిసిన భారీ గాలి వానకు సర్వస్వం కోల్పోయిన ఓ పేద కుటుంబానికి బీజేపీ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ గారు అండగా నిలిచారు. వల్లభపురం గ్రామానికి చెందిన అనుముల సైదమ్మ గారి ఇంటి పైకప్పు గాలి వానకు లేచిపోవడంతో ఆమె కుటుంబం నిలువనీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మన్నెం రంజిత్ యాదవ్ గారికి ఈ విషయం తెలియడంతో ఆయన తక్షణమే స్పందించారు. తాను దూరంగా ఉన్నప్పటికీ, తన అనుచరుల,క్షేత్రస్థాయిలో బాధితురాలి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి అత్యవసర సాయం కింద 10,000/- రూపాయల ఆర్థిక సాయాన్ని తన అనుచరుల ద్వారా బాధితురాలు సైదమ్మకు అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… విదేశాల్లో ఉండి కూడా తమ గ్రామ ప్రజల కష్టాన్ని మరువకుండా, సమాచారం అందిన వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్న మన్నెం రంజిత్ యాదవ్ గారికి, ఆయన టీం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బొమ్మానబోయిన సత్యనారాయణ,మాజీ సర్పంచ్ రవి,నాగార్జున సాగర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కడియం సైదులు,బీజేపీ బూత్ అధ్యక్షులు పెద్దబోయియిన రాజు యాదవ్, గంగుల దశరథ, మెండే పెద్ద సైదయ్య, గంగుల సైడయ్య, పాపయ్య, మల్లయ్య, మెండే సైదయ్య, శివ, నాగరాజు, శ్రీనివాస్, నాగరాజు,నాగార్జున, లింగస్వామి,రంజిత్ అన్న యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు