వరంగల్ నగరంలో విద్యుత్ శాఖలో ADEగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డి గారి జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన భద్రకాళి దేవస్థానం ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం పరిసరాల్లోని పేదలకు అరటిపండ్లు పంపిణీ చేయడంతో పాటు గోశాలలో మూగజీవాలకు గడ్డి, ఆహారం అందజేశారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి గారు మాట్లాడుతూ.. నేటి సమాజంలో పుట్టినరోజులు, శుభకార్యాలను ఆడంబరంగా జరుపుకోవడం కంటే పేదలకు సహాయం చేయడం, మూగజీవాలకు ఆహారం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతికి మేలు చేసే విధంగా నేచురల్ పద్ధతిలో వేడుకలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్నేహితులు, సహచర ఉద్యోగులు మరియు స్థానికులు పాల్గొని రాజిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 19









