సంగారెడ్డిలో ప్రారంభమైన సీపీఎం జిల్లా స్థాయి క్లాసులు

  • అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి
  • అమెరికన్ సామ్రాజ్య వాదానికి తలొగ్గి దేశ ప్రయోజనాలు తాకట్టుపెట్టిన మోడీ
  • అంబానీ, అదానీల కోసమే ప్రజలపై బారాలు
  • పెంచిన పెట్రోల్ డీజీల్ ధరలు తగ్గించాలి
  • ప్రజా సమస్యలపై పోరాటం చేసేది ఎర్ర జెండానే
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

ప్రపంచ దేశాలపై అమెరికన్ సామ్రాజ్యవాద దాడి పెరుగుతుందని, అమెరికా సామ్రాజ్య వాదానికి తలొగ్గి దేశ ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ విమర్శించారు . ఈరోజు సంగారెడ్డి కేవల్ కిషన్ భవన్ లో సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ తరగతుల ప్రారంభ సూచికంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు పార్టీ జెండావిష్కరణ చేయడం జరిగింది .

ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. దేశ సంపదనను అంబానీ అదానీలకు ఇస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై మాత్రం భారాలు మోపుతున్నారని విమర్శించారు.పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.మోడీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని అన్నారు. అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలతో దేశానికి జరిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు. పైగా ఆ ఒప్పందాల ప్రభావం దేశంలోని కార్మికులు, రైతులపై తీవ్రంగా ఉంటుందని తెలిపారు. అమెరికాతో చేసుకుంటున్న ట్రేడ్‌ ఒప్పందాల వివరాలను ఇప్పటివరకు పార్లమెంట్‌కు గానీ, దేశ ప్రజలకు గానీ తెలియజేయలేదని విమర్శించారు. ఈ చర్య దేశీయ పరిశ్రమలు, ఉపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల జీవనోపాధిపై దాడి జరుగుతుందని అన్నారు. ఈ ఒప్పందాలపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడం దేశాన్ని అవమానపరచడమే కాక ప్రజాస్వామ్యానికి తీవ్రమైన హాని అని పేర్కొన్నారు.

దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య వైశమ్యాలను పెంచి పోషిస్తుందని, మతాల మధ్య అగ్గి రాజేస్తూ వాటి మధ్యలో కూర్చొని చలికాచుకుంటుందన్నారు. దేశంలో లౌకికవాదాన్ని మంట కలుపుతూ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజా సమస్యలను దారిమల్లిస్తూ నియంతలాగా దేశాన్ని మోడీ పరిపాలిస్తున్నారని వాపోయారు. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారతదేశ సంస్థలన్నింటినీ వారికి తాకట్టు పెడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందన్నారు. అమెరికా అధ్యక్షులు మన దేశ అంతర్గత విషయాల్లో పెత్తనం చేస్తూ ఉంటే నోరు ఎత్తడం చేతకాని ప్రభుత్వమని చెప్పారు. మోడీ ఓ పక్క మతోన్మాదాన్ని మరోపక్క కార్పొరేట్‌ వ్యక్తులను అడ్డుపెట్టుకొని దేశంలో పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. దేశంలోని పార్లమెంట్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా తనకు అనుకూలమైన బిల్లులు పాస్ చేయించుకొని నియంతల పాలన సాగిస్తున్నదని అన్నారు. ధరల పెంపు తప్పా ప్రజా సంక్షేమ చర్యలేవి మోడీ తీసుకురాదన్నారు. బిజెపి విధానాలను వ్యతిరేకించడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. ఎర్ర జెండా ఆధ్వర్యానా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు.

పార్లమెంట్ సాక్షిగా ఉపాధి హామీ చట్టాన్ని నేరుగార్చారని పేద కూలీల పొట్ట కొడుతున్నారని కూలీలను మభ్యపెట్టి రాముని పేరుతో భజన చేస్తున్నారని ఈ విషయంలో కాంగ్రెస్ సరైన తీరులో స్పందించకపోవడం శోచనీయమన్నారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ను గృహాలకు పేదలకు దళిత గిరిజనులకు ఉచిత విద్యుత్ను రద్దు చేసేందుకే విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చారని ఇది రైతాంగం మనుగడకు ముప్పని అన్నారు. అను విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటుపరం చేసి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే శాంతి బిల్లు తెచ్చారని ఇది ప్రమాదకరమైన ది అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య, మాణిక్, సాయిలు, నర్సింలు, నాయకులు నాగేశ్వర్ రావు, యాదగిరి, కృష్ణ, విద్యా సాగర్, పాండు రంగారెడ్డి, తది తరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు