నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో సెంట్రింగ్ పనుల బంద్: కార్మికుల హక్కుల కోసం ఎస్హెచ్ఓకు వినతిపత్రం!

గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి సెంట్రింగ్ పనులను నిలిపి వేస్తున్నట్టు హైదరాబాద్ జోన్ అధ్యక్షుడు వెంకటనారాయణ తెలిపారు. శనివారం అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ ఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భం వెంకట్ నారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికులకు కార్మిక శాఖ నుండి శాశ్వత గుర్తింపు కార్డులను ఇవ్వాలని 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు ప్రతినెల 3 వేల రూపాయలు పెన్షన్ సదుపాయం కల్పించాలని ఈఎస్ఐ వారు డిమాండ్ చేశారు సెంట్రింగ్ పాత రేట్లను 40 రూపాయల నుండి 51 రూపాయలకు పెంచాలని భవన నిర్మాణ యజమానులు మేస్త్రీల ద్వారా కాకుండా నేరుగా సెంట్రింగ్ కాంట్రాక్టర్లను సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గోల్నాక అధ్యక్షుడు బిక్షపతి , గోల్నాక సెంట్రింగ్ జనరల్ సెక్రెటరీ వెంకటేష్ , సాయిబాబా , ఏం లింగం , ముత్తయ్య, ఎండి అబ్దుల్, మల్లేష్ , ఐలయ్య సంజీవ, ఏం వెంకటేష్ , రాజు యాదవ్, అల్వాల్ , చందు , రామకృష్ణ, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు