TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన “టీ 4 యు” హోటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
పట్టణంలోని కొత్త రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట, జాతీయ రహదారి ఎన్ హెచ్-65 పక్కన హోటల్‌ను ఏర్పాటు చేశారు.అబ్దుల్ రజాక్ కుటుంబ సభ్యులు ఆధునిక సౌకర్యాలతో హోటల్‌ను ప్రారంభించారు.రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.పులిమామిడి రాజు రిబ్బన్ కట్ చేసి హోటల్‌ను అధికారికంగా ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.స్థానిక ప్రజలకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆయన ఆకాంక్షించారు.
యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంఅభినందనీయమని పులిమామిడి రాజు పేర్కొన్నారు.
వ్యాపార రంగంలో యువకులు ముందుకు రావడం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు.“టీ 4 యు” హోటల్ ప్రారంభోత్సవం సదాశివపేటలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. ఇట్టి కార్యక్రమంలో ఎండి ఫయాజ్, ఎండి నిసార్, అబ్దుల్ రజాక్, ఎండి అబ్దుల్, మోయిన్, ఎండి.ఇంతియాజ్ మొదలగు వారు పాల్గొన్నారు.









