అల్లం బాల కిషోర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ: 3,500 మందికి పైగా దాహార్తిని తీర్చిన వైనం!

ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లని ఉపశమనం కల్పించే లక్ష్యంతో అల్లం బాల కిషోర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొమ్మాల అంగడి ప్రాంగణంలో ఉచిత శీతల మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి ఆలోచనతో చేపట్టిన ఈ ‘దాహ నివారణ సేవ’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రైతులు, పశువుల వ్యాపారులు, ప్రయాణికులకు దాదాపు 3,500 మందికి పైగా ఉచితంగా చల్లని మజ్జిగ పంపిణీ చేసి ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి స్వయంగా పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలతో కలిసి సేవ చేయాలనే తపన ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైందని స్థానికులు అభినందించారు.
కార్యక్రమంలో కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన యమునా ప్రవీణ్, దశ్రుతండ సర్పంచ్ కేలోతు అమృత బిక్షపతి, సూర్యతండా సర్పంచ్ బాణోతు రాఘవేంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ప్రతి శనివారం ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. సమాజ సేవ పట్ల అంకితభావంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.
రిపోర్ట్. అమరేంద్ర చారి. 9550056793

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు