వరంగల్ నగరంలో:
స్వర్ణకారుల హక్కుల సాధన కోసం కృషి చేసిన మారోజు వీరన్న 27వ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ వీరన్న స్వర్ణకారుల సంక్షేమం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన, కట్కోజ్వల శ్రీనివాస్, మియాపురం పవన్, అమరేంద్ర చారి, సంఘ సభ్యులు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
Post Views: 55









