గుర్రంపోడు ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

గుర్రంపోడు న్యూస్ : గుర్రంపూడ్ మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో ఇంటర్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జి. రాగిణి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపిసి, సిఇసి తోపాటు ఈ ఏడాది కొత్తగా ఏసీఈ కోర్సు ప్రవేశపెట్టినట్లు తెలిపారు, ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం వాణిజ్య విద్య ప్రధానంషాలుగా అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ అంశాలతో ఈ కోర్స్ అందుబాటులో ఉందన్నారు.
ఈ కోర్సులతోపాటు వృత్తి విద్యలో భాగంగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ మరియు హెల్త్ కేర్ సబ్జెక్టులు అందుబాటులో కలవని తెలిపారు.
10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మార్కులు, రిజర్వేషన్, నిబంధనల ఆధారంగా సీట్ల భర్తీ జరుగుతుందని తెలిపారు.
దరఖాస్తులను ఈ నెల 25 వరకు https://tgms.telangana.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
మరిన్ని వివరాల కోసం నాంపల్లి రోడ్డులో ఉన్న మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జి. రాగిణి గారిని నేరుగా లేదా 9397320844 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు అని తెలిపారు.
మండల విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ గారు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు