సదాశివపేటలో నిర్వహించిన సాధారణ మండల సమావేశం పాల్గొన్న చైర్పర్సన్ వైస్ చైర్మన్ అధికారులు 

TG 5,సంగారెడ్డి ప్రతినిధి

 సదాశివపేట పురపాలక సంఘంలో నిర్వహించిన సాధారణ మండలి సమావేశం విజయవంతంగా ముగిసినది. సమావేశంలో మొత్తం 11 అజెండా అంశాలు ఆమోదించబడినవి.

అందులో ముఖ్యంగా UCF (Urban Challenge Fund) కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు 1 MW సోలార్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపినది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా పట్టణ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అదేవిధంగా సదాశివపేటను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ఇది ఒక కీలక ముందడుగుగా భావించబడుతున్నది.

అలాగే సిద్ధాపూర్ ప్రాంత ప్రజలకు సమీపంలో మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో, ఆ ప్రాంత ప్రజలు సమీపంలోనే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునే విధంగా సిద్ధాపూర్ ప్రాంతంలో ప్రతి శుక్రవారం మార్కెట్ నిర్వహించేందుకు మండలి తీర్మానం చేసినది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు