TG 5,సంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR) లో ప్రజలందరూ తప్పక పాల్గొనాలని సూచించారు టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. సంగారెడ్డి మున్సిపాలిటీ లోని 24 వ వార్డులో SIR పై ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యక్రమం లో ఆమె పాల్గొని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమగ్ర సవరణ పై అపోహాలు వదిలేయాలని కోరారు. దీనివల్ల ఎవరి ఓటు హక్కు కోల్పొరని అన్నారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నవారికి ఒకటే దగ్గర ఓటు హక్కు పరిమితం అవుతుంది అన్నారు. సమగ్ర సవరణ వల్ల ఓటర్లలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్ నవాజ్, సోహైల్, బబ్బు , సంగారెడ్డి తహశీల్దార్ జైరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 70









