బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలి – సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు.

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

బండి భగీరథ్ పై ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ రాజకీయ వత్తిడికి పోలీసులు లొంగి అరెస్టు చేయడం లేదని, వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. గురువారంనాడు సంగారెడ్డి న్యూ బస్టాండ్ వద్ద మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. భాద్యత కలిగిన స్థానంలో ఉన్న మంత్రి బండి సంజయ్ చట్టంపై గౌరవం ఉంచి తన కొడుకును అప్పగించాలని డిమాండ్ చేశారు. పైగా మంత్రి బండి సంజయ్ బెదిరింపులకు పాల్పడడాన్ని చూస్తే కేసును తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని అన్నారు.బాధిత కుటుంబం కు న్యాయం చేయాలని ప్రభుత్వం ను కోరారు. ఈ కార్యక్రమం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి సాయిలు, మాణిక్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎం యాదగిరి, నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు