అత్యాచార ఘటనపై వరంగల్‌లో ఏఐవైఎఫ్ నిరసన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్

తెలంగాణ వరంగల్, మే 14:

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ పోచమ్మైదాన్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో 17 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిరసనకారులు దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ నాయకుడు డా. సయ్యద్ వలి ఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు సమాజానికి మచ్చగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ అండదండలు ఉన్నా లేకపోయినా నేరస్తులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి మస్కా సుధీర్, జగదీష్, మతీన్ కాకా, రమేష్, లక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు