TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట పట్టణానికి చెందిన బొడుగు స్వరూప అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఖర్చుల కారణంగా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు రూ.1 లక్ష 25 వేల LOC ఆర్థిక సహాయం మంజూరుకు కృషి చేసి, సంబంధిత చెక్కును సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా స్వరూప కుటుంబ సభ్యులు తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ జాఫర్ తదితరులు ఉన్నారు.
Post Views: 12









