వార్డు అధికారుల పనితీరుపై గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, ఇన్ ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాశీబుగ్గ సర్కిల్ పరిధిలోని 39వ డివిజన్ వార్డు అధికారి కంజర్ల ప్రశాంత్‌ను సస్పెండ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఇన్‌ఛార్జి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పన్ను వసూళ్ల లక్ష్యం సాధించకపోవడం, దురుసుగా ప్రవర్తించినట్లు అధికారుల విచారణలో తేలడంతో వేటు వేశారని తెలిసింది. వార్డు అధికారుల పని తీరు మారకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని చాహత్ బాజ్‌పాయ్ హెచ్చరించారు.
Post Views: 22









