హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహణ

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాద్యతలు తీసుకున్న A. మహేందర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ గారు రౌడీ షీటర్లకు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు, భూ కబ్జాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

అలాగే భవిష్యత్తులో ఎటువంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. యువత చెడు మార్గాలను విడిచిపెట్టి ఉపాధి, కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టాలని తెలిపారు. నేరాలకు పాల్పడినట్లయితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు