- మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా
- ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపాలి
- తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత గుప్తా
యాంకర్ పార్ట్ : ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపాలని తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత గుప్తా పిలుపునిచ్చారు. ఒకరికి ఓటు వేయకుండా మన వారికి ఓట్లు వేసి గెలిపించుకుంటే సమస్యలు త్వరగా పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని సూచించారు. కేవలం కార్పొరేట్ ఉద్యోగాలు చేసుకునే వారికే కాకుండా వ్యాపారాలు చేసుకునే వారికి కూడా తమ పిల్లలను ఇచ్చి వివాహాలు జరిపించాలని కోరారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో మల్కాజిగిరి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆమె ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
వాయిస్ ఓవర్ : వ్యాపారస్తులే ఎప్పటికైనా మిగిలేదన్న విషయాన్ని ఆర్య వైశ్య సోదరులు గుర్తుంచుకోవాలని రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత కోరారు. ఆర్యవైశ్యుల్లో కూడా విడాకుల కోసం కార్పొరేషన్ కార్యాలయానికి రావడం ఆందోళన కలిగిస్తోందని. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సంఘ సభ్యులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా , నూతన అధ్యక్షులు అల్లంపల్లి సురేష్ గుప్తా, ఉపాధ్యక్షులు బి.వై. ఎస్ గుప్తా , కోశాధికారి కొత్తూరు చంద్ర శేఖర గుప్తా , మహిళా అధ్యక్షురాలు బూరుగు లావణ్య తదితరులు పాల్గొన్నారు.
బైట్ 1 : కాల్వ సుజాత గుప్తా ( తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్)
బైట్ 2 : అల్లంపల్లి సురేష్ గుప్తా (మల్కాజిగిరి ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు)









