- నక్కవాగు ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి
- భూగర్భ జలాలు కాపాడాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
TG 5, సంగారెడ్డి ప్రతినిధి
కంది మండలంలోని నక్కవాగు ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని,భూగర్భ జలాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు* ప్రభుత్వంను డిమాండ్ చేశారు. నేడు సిపిఎం ఆధ్వర్యంలో ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్కవాగు పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్న అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. భూగర్భ జలాలు కాపాడాలని అన్నారు. రైతుల పంట పొలాలు ఎండిపోకుండా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు నక్క వాగు పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నక్కవాకు పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని తెలిపారు.









