గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కోనాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి వసంతా శివ నాగప్ప పాటిల్ మరణ వార్త తెలుసుకున్న సంగారెడ్డి గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ వారి స్వగ్రామానికి వెళ్లి నివాళులు అర్పించారు.

TG 5, సంగారెడ్డి ప్రతినిధి
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా గతంలో ఆమె సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామ అభివృద్ధికి చేసిన సేవలను గ్రామస్తులు, పార్టీ నాయకులతో కలిసి గుర్తు చేసుకున్నారు.

ఎమ్మెల్యే వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, సీనియర్ నాయకులు మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, మాజీ సర్పంచ్ సంగమేశ్వర్, నాయకులు శ్రీనివాస్, శేఖర్, మనోహర్, మురళి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు