చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. రైతులెవ్వరూ అధైర్య పడొద్దు – టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

చివరి వడ్ల గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ విషయం లో రైతులెవరూ అధైర్య పడవద్దని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం కంది మండలం కలివేముల గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయం లో నిబద్దత తో ఉందని, రైతులు పండించిన పూర్తి ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రైవేట్ రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం అమ్మవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్మాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ బ్లాక్ ప్రెసిడెంట్ చిదృప్ప రఘు, కంది మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మొగులయ్య, మాజీ ప్రెసిడెంట్ మోతి లాల్, పిఎసిఎస్ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ పవిత్ర, ఉప సర్పంచ్ నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహ రెడ్డి, వార్డు మెంబర్ లు, రైతులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు