తేదీ :13-05-2026
స్థలం: వరంగల్ చౌరస్తా
- ఈ రోజు వరంగల్ చౌరస్తా లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా శ్రీరాముడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీరాముని సాక్షిగా బిజెపి నాయకులను ప్రశ్నించిన *గ్రేటర్ వరంగల్ మరియు వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ్రీ నన్నపునేని నరేందర్ గారు
అనంతరం
- బి ఆర్ ఎస్ పార్టీ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు మాట్లాడుతూ :
- భారత దేశంలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది.
- 2014లో ‘చాయ్ వాలా’ అని చెప్పి ప్రజలను నమ్మించిన మోదీని గెలిపిస్తే మహిళలకు భద్రత కరువైంది.
- ‘చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం అని చేసిన ప్రమాణం ఏమైంది?
బేటీ బచావో’ నినాదం ఎక్కడ ఉంది?
- బాలికలకు రక్షణ లేదని చెప్పడానికి బండి సంజయ్ కుమారుడి వ్యవహారమే పెద్ద ఉదాహరణ.
- మాకు అన్యాయం జరిగింది” అని బాధితురాలు చెబితే మాట్లాడేది లేదని బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటు. మేము చూస్తూ ఊరుకోం.
- సామాజిక న్యాయం కోసం పోరాడతాం.
- బాధితులపైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. ప్రధాని భద్రతకు, కేసు ఆలస్యానికి సంబంధం ఏమిటి?
- అలాంటి వ్యక్తిని ప్రధాని పక్కన పెట్టుకోవడం సిగ్గుచేటు.
- ఆలస్యంగా కమిటీ వేశారు. ఎందుకు ఈ కమిటీ? నిందితుడు భగీరథ్ ‘ప్రజల మధ్యనే ఉన్నాను’ అంటున్నాడు. కానీ పోలీసులు ‘దొరకడం లేదు’ అంటున్నారు. ఏది నిజం?
- బండి సంజయ్ వరంగల్‌కు వచ్చి బురద చల్లి పోయాడు. నేను సవాల్ చేస్తున్నా – ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.
- అబద్ధాన్ని నిజం చేయడంలో బీజేపీ ముందుంటుంది. స్థానిక బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? బీసీల పట్ల వారి చిన్నచూపు ఇదే.
- నాలుగోసారి నీట్ రద్దుకు కేంద్రమే బాధ్యత వహించాలి. ఉత్తరాదిన ప్రజాధనాన్ని దోచుకుంటూ, దక్షిణాదిని అవహేళన చేస్తున్నారు.
- ఉద్యోగాల కోసం, విద్య కోసం జరిగిన పరీక్షలు 65 సార్లు లీక్ అయ్యాయి. ‘ధర్మం కోసం, న్యాయం కోసం’ అని చెప్పడం కాదు – చేసి చూపించాలి.
- ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మరియు ఇన్చార్జీలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, యువజన నాయకులు మహిళ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post Views: 11









