పోక్సో కేసులో బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి: మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి డిమాండ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథును వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని 4 0 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మైనర్ బాలికను అత్యాచారం చేసి అఘాయిత్యానికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తిపై పోలీసులు ఫోక్సో కేసును నమోదు చేసిన ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయకపోవడం చాలా వి డ్డూరంగా ఉందన్నారు రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఒక న్యాయం సామాన్య ప్రజలకు ఒక న్యాయమాఅని ఆయన ప్రశ్నించారు భారతదేశానికే హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ కుమారుడే ఈ విధంగా పాల్పడుతుంటే కంచే చేను మేసినట్టుగా ఉందన్నారు రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సామాన్య ప్రజలపై అరాచకాలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఇలా ఉంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేకూరుతుందని ఆయన అన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇది కులం కు సంబంధించిన విషయం వారి వారి పెద్ద మనుషులతో మాట్లాడుకుంటే సరిపోతుందని పేర్కొనడం సరికాదని అలాంటప్పుడు చట్టాలు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ ని కాపాడడానికి ప్రయత్నిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే భగీరథను అరెస్టు చేసి బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని మరు పల్ల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు