గుర్రంపూడ్ మండలంలో ఉచిత టైక్వాండో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

నల్గొండ జిల్లా గుర్రంపూడ్ మండలం మోసంగి గ్రామంలో విద్యార్థులకు ఉచిత టైక్వాండో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం (సమ్మర్ స్పెషల్ ఉచిత క్యాంపు) ఘనంగా ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, వారి శారీరక, మానసిక దృఢత్వానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.గ్రామ సర్పంచ్ పిల్లి ఉమారాణి అభినయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిక్షణా శిబిరాన్ని టైక్వాండో జిల్లా జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్, సర్పంచ్ పిల్లి ఉమారాణి అభినయ్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఇలాంటి క్రీడల్లో రాణించాలన్నారు. ముఖ్యంగా బాలికలకు ఆత్మరక్షణ విద్య ఎంతగానోఉపయోగపడుతుందని, గ్రామీణ ప్రాంత పిల్లల కోసం ఉచితంగా ఈ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కోట్ల శ్రీనాథ్, వార్డు సభ్యులు నిరసన మెట్ల లవ కుమార్, ప్రముఖులు మాదాసు శ్రీకాంత్, నిరసన మెట్ల సందీప్, బడుగుల శ్రీనివాస్, నిరసనమట్ల బాలయ్య, కాంచని చంటి, గోవు నాగరాజు, నిరసన మెట్ల సంతోష్, నడ్డి మల్లేష్, మర్రి నాగరాజు, పిల్లి నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు విచ్చేసిన టైక్వాండో కోచ్ మనోజ్, సీనియర్ ప్లేయర్ పూర్ణ చందు, మరియు మర్రి మైసయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో ఉచితంగా క్రీడా శిక్షణ అందిస్తున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సర్పంచ్ పిల్లి ఉమారాణి అభినయ్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు