మల్కాజిగిరి : మారుతి నగర్ హనుమాన్ దేవాలయంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తులకు తాగునీరు, ప్రసాదం తదితర సౌకర్యాలను సమకూర్చి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Post Views: 11









