TG 5, సంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమం”లో భాగంగా కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యా వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 11 నుండి మే 17 వరకు ఏడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి గంజి స్వాగత ఉపన్యాసం చేస్తూ విద్యార్థులు విద్య యొక్క ప్రాముఖ్యతను గ్రహించి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. డిగ్రీతోనే ఆగిపోకుండా ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేణుక చిరంజీవి మాట్లాడుతూ విద్య యొక్క గొప్పతనాన్ని వివరించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువును మధ్యలో ఆపకుండా పట్టుదలతో కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై తమ గ్రామాలకు, కుటుంబాలకు గౌరవం తీసుకురావాలని ఆశీర్వదించారు.
కళాశాల పూర్వ విద్యార్థి మహేష్ విద్యా వారోత్సవాల ప్రాముఖ్యత, ఉపాధి అవకాశాలు, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉన్నత విద్య పాత్ర గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిద్దులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ పి. మురళీకృష్ణ శకుంతల , సారవయ్య సావిద్య మంజుల రాజిరెడ్డి స్రవంతి శంకరయ్య రాజకుమార్ తదితర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.









