గ్రామీణ ప్రతిభకు పెద్దపీట: ‘తెలంగాణ ప్రీమియర్ లీగ్’ క్రీడాకారుల ఎంపికలో ఏఐ (AI) టెక్నాలజీ

తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లను నిర్వహిస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి , ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు తెలిపారు …

హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వివరాలను అందజేశారు …

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

వచ్చే నెలలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది ప్రావీణ్యం కలిగిన క్రీడాకారులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు ‌…

ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా పారదర్శకత ఉన్న పది మంది మాజీ క్రికెటర్లను సెలెక్టర్లను ఎంపిక చేసినట్లు సెక్రటరీ జీవన్ రెడ్డి తెలిపారు …

ప్రావీణ్యం కలిగిన క్రీడాకారుల ఎంపికలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టామనీ , దీని వల్ల ఎలాంటి అవకతవకలు లేకుండా నిజమైన క్రీడాకారులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుందని ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు అన్నారు …

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు