మడుపతి వారి పెళ్లి వేడుకలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు.

TG 5 సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట బసవ సేవాసదన్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన మడుపతి శ్రీదేవి వీరన్న దంపతుల పుత్రిక భవాని సంగమేశ్వర్ ల వివాహము అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు.వివాహ వేడుకలో స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అభిమానులు పులిమామిడి రాజు కి ఘన స్వాగతం పలికారు.వివాహ మండపం సందడి వాతావరణంలో కళకళలాడింది.పలువురు ప్రముఖులు వధూవరులకు ఆశీస్సులు అందించారు.
సాంప్రదాయ పద్ధతిలో వివాహ కార్యక్రమం నిర్వహించారు.
కుటుంబ సభ్యులుఅతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది. ఇట్టి వేడుకలో గందిగె రాజు, నాగులపల్లి సర్పంచ్ శివానందం, బోడగామ నాగభూషణం, మడుపతి వీరయ్య స్వామి, విట్టల్ రెడ్డి మరియు పి ఎం ఆర్ యు వసేన నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు