వరంగల్…కరిమాబాద్‌ లోని “ఏకశిలా పరపతి సంఘం”ఎదుట బాధితుల ఆందోళన

సంఘాల పేర్లతో, చిట్టీల పేరుతో పేద ప్రజల దగ్గర నెలల తరబడి పైసలు వసూలు చేసి…

చివరకు లెక్కలు చెప్పకుండా చేతులు ఎత్తేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ని వార్తలు వచ్చినా, ఎంత అవగాహన కల్పించినా… అధిక లాభాల ఆశతో మళ్లీ మళ్లీ ప్రజలు ఇలాంటి మోసాలకు బలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇటీవల మార్కెట్‌లో కోట్ల రూపాయల టోకరా పెట్టిన ఓ మహిళ… చివరకు “సూసైడ్ డ్రామా”తో బెదిరించి పోలీసులను, చట్టాన్ని సైతం తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

“మా కష్టార్జిత డబ్బులు తిరిగి ఇవ్వాలి… సంఘాల పేరుతో జరుగుతున్న మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజలు కూడా చిట్టీలు, పరపతి సంఘాల్లో డబ్బులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు