జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్ పరిధిలో కాజీపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ వ్యాగన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఫైర్ స్టేషన్ సిబ్బంది, రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఎండ తీవ్రత కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని భారీ ప్రమాదాన్ని తప్పించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిహెచ్ ప్రసాద్
జనగామ స్టాఫ్ రిపోర్టర్..
Post Views: 130









