దర్వేశిపురంలో వైభవంగా మనోజ్ యాదవ్, హిమబిందుల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం గ్రామ మాజీ ఉపసర్పంచ్ కట్టెబోయిన విజయ్ యాదవ్ – అనూష దంపతుల కుమారుడు మనోజ్ యాదవ్, కుమార్తె హిమబిందుల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. దర్వేశిపురం గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సన్నిధిలో గల వేద (ఏసీ) ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నులపండువగా సాగింది.ఈ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులు మనోజ్, హిమబిందులకు నూతన వస్త్రాలను అందించి, వారిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. అనంతరం విజయ్ యాదవ్ కుటుంబ సభ్యులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిల్లి రామరాజు యాదవ్ వెంట పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బ్రాహ్మణగూడెం గ్రామ ప్రముఖులు మరియు విజయ్ యాదవ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన అతిథులందరికీ విజయ్ యాదవ్ దంపతులు సాదర స్వాగతం పలికి విందు ఏర్పాటు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు