TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట మండలంలోని ఆరూరు గ్రామంలో హనుమాన్ మందిరం 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఉదయాన్నే ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించి, చంద్రం దిద్ది స్వామి వారిని అలంకరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆరూర్ సర్పంచ్ నాయి కోటి లావణ్య మధు దంపతులు ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది.
Post Views: 274









