ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.
ప్రధానంగా ఆరోగ్యశ్రీ నిధుల గోల్మాల్, మందుల కొనుగోళ్ల వ్యవహా రంపై దృష్టి సారించినట్లు సమాచారం. విజిలెన్స్ డీఎస్పీ మల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి.
మందుల కొనుగోళ్ల వ్యవహారంతోపాటు ‘బై హ్యాండ్ పర్చేజెస్’ మందుల కొనుగోళ్ల తీరును విజిలెన్స్ బృందం పరిశీలించింది.
ప్రభుత్వ మెనూ ప్రకారం.. భోజనాలు అందజేస్తున్నారా? లేదా అన్న విషయాన్ని నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు.
పారి శుద్ధ్యం, సెక్యూరిటీ టెండర్ అంశాలు పరిశీలించారు.
వైద్యులు, ఉద్యోగుల హాజరు వివరాలు తనిఖీ చేశారు.
విజిలెన్స్ అధికారుల బృందం ఎంజీఎంకు రావడంతో మినిస్టీరి యల్ సిబ్బందిలో ఆందోళన మొదలైంది.
గతంలో రెండు పర్యాయాలు శాఖాపరమైన విచారణ చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం విజిలెన్స్ బృందమే నేరుగా రంగంలోకి దిగడంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు.









