రోడ్డు భద్రతే లక్ష్యంగా పోలీసుల ఉక్కుపాదం!

పోచమ్మమైదాన్, పోస్టాఫీస్ కూడళ్లలో ముమ్మర తనిఖీలు.. మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేని వారిపై జరిమానాల మోత.

వరంగల్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోచమ్మమైదాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ,వరంగల్ ట్రాఫిక్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ కోడూరి సుజాత ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు డ్రంకెన్ డ్రైవ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కట్టుదిట్టంగా నిర్వహించారు. అదే సమయంలో వారి సిబ్బంది పోస్టాఫీస్ జంక్షన్ తో పాటు పలు ముఖ్యమైన కూడళ్లలో విస్తృతంగా అడుగడుగునా తనిఖీలు జరిపాయి. ముఖ్యంగా ప్రాణాలకు ముప్పు తెచ్చే మైనర్ డ్రైవింగ్ కు పాల్పడుతున్న యువతను, కనీస బాధ్యత లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్లెక్కిన వాహనదారులను గుర్తించి భారీగా జరిమానాలు విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారి పట్ల ఎంత కఠినంగా ఉంటామో స్పష్టం చేస్తూ, యువతరం భద్రతతో పాటు సామాన్య ప్రజల ప్రాణరక్షణే తమ ప్రథమ కర్తవ్యమని వరంగల్ ట్రాఫిక్ సీఐ కోడూరి సుజాత అన్నారు .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు