మే 10వ తేదీన నిర్వహించబడనున్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రచార రథాన్ని ప్రారంభించిన బిజెపి రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు.
సిటీ ప్యాలెస్ లో నిర్వహించబడిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి దిశగా ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అపారమని అన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సభకు తరలి వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి చేరుకునేలా ప్రచార రథం ద్వారా సభ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధం నరేష్, సీనియర్ నాయకులు రత్నం సతీష్ షా, సముద్రాల పరమేశ్వర్, బైరి మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్, రఘునా రెడ్డి, గడల కుమార్, మండల అధ్యక్షులు అపురూప సాయి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మార్టిన్ లూథర్, సీనియర్ నాయకులు మాదాసు రాజు,స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.









