బొల్లారంలో విషాదంబాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు, వెలగపురి కరుణాకర్ రావు 

బొల్లారం గ్రామానికి చెందిన గడ్డం దయాకర్ ఇటీవల మరణించడం పట్ల స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వారం రోజుల క్రితం ఆయన తుదిశ్వాస విడవగా, ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా చితికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెల్గాపురి కరుణాకర్ రావు గారు గురువారం బాధిత కుటుంబాన్నిపరామర్శించారు.దయాకర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన కరుణాకర్ రావు గారు, వారికి తక్షణ సాయంగా కొంత నగదును ఆర్థిక సహాయం రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దయాకర్ మరణం అత్యంత బాధాకరం. కష్టాల్లో ఉన్న ఈ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కేవలం ఈరోజే కాదు, భవిష్యత్తులో వారికి ఏ అవసరం వచ్చినా నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని సహాయం చేస్తాను” అని భరోసా ఇచ్చారు.గ్రామ సర్పంచ్ వెల్గాపురి రాంబాబు రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని, గ్రామస్థుడిగా దయాకర్ కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఒక నిరుపేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర స్థాయి నాయకులు స్పందించి సహాయం చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు