నల్గొండ వన్‌టౌన్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.

నల్లగొండ:రిపోర్టర్-నవీన్ కుమార్.Ch

హెల్మెట్ లేని వాహనదారులకు అవగాహనతో పాటు జరిమానాలు

నల్గొండ పట్టణ ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కే శివరాం రెడ్డి సూచనలతో వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.

తేదీ 07-05-2026న నల్గొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన ఈ తనిఖీల్లో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులను పోలీసులు ఆపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం చట్టపరమైన చర్యల్లో భాగంగా ఈ-చలానాలు నమోదు చేశారు.

పోలీసులు కేవలం జరిమానాలు విధించడానికే పరిమితం కాకుండా, హెల్మెట్ వెంట తీసుకురాని వాహనదారులు అక్కడికక్కడే హెల్మెట్లు తెప్పించుకునేలా చర్యలు తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెల్మెట్ ధరించిన తర్వాతే వారిని ప్రయాణానికి అనుమతించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం చలానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాకుండా ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని తెలిపారు. ఐఎస్ఐ మార్క్ కలిగిన నాణ్యమైన హెల్మెట్లను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అలాగే అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యల వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చాలా రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే ప్రాణనష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల కోసం సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. పోలీసుల ఈ వినూత్న చర్యను స్థానిక ప్రజలు, వాహనదారులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు కే సతీష్, జె సైదులు, బి లచ్చిరెడ్డి, ఎన్ వెంకటనారాయణతో పాటు సిబ్బంది శ్రీనివాసరెడ్డి, శంకర్, శ్రీనివాస్ తదితరులు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు