డిమాండ్ ఉన్న, లాభదాయకమైన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

రిపోర్టర్: ఉల్లిగడ్డల శివకుమార్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

ప్రస్తుత మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులు డిమాండ్ ఉన్న, లాభదాయకమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ, విద్యుత్, రెడ్‌కో శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక దిగుబడులతో పాటు మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవసరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు అవగాహన పెంపొందించుకుని పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేయాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు